మార్కాపురం: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జగ్జీవన్ రాం 118 వ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ 118 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో మొదటిసారి కలెక్టర్ విజయ సునీత అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. దేశానికి జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జెసి శ్రీనివాసులు బిజెపి మీడియా అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్ర రెడ్డి, ఆర్డీవో ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.