కొండపి: పొన్నలూరు మండలం ముత్తరాసు పాలెంలో కిశోర వికాసం సమ్మర్ క్యాంపు ఏర్పాటు
పొన్నలూరు మండలం ముత్తరాసు పాలెంలో కిశోర వికాసం సమ్మర్ క్యాంపును శుక్రవారం ఏర్పాటు చేశారు. సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ.. ఈనెల పదో తేదీ వరకు కిశోర బాలికలకు క్యాంపు ద్వారా పలు అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. 11 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు కిశోర బాలికలకు వ్యక్తి వికాసం, వ్యక్తిగత అభివృద్ధి, రక్షణ, బాల్య వివాహాల నిర్మూలన, పౌష్టికాహారం వంటి పలు అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.