కొండపి: సింగరాయకొండ లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దృశ్యాలు
సింగరాయకొండలో గురువారం ఓ చిన్నారి కిడ్నాపు గురైంది. 3 ఏళ్ల చిన్నారిని ఓ యువకుడు ఎత్తుకెళ్లటాన్ని సీసీ కెమరాల ద్వారా పోలీసులు గుర్తించారు. చిలుకూరు హరికృష్ణ కూతురు ఐశ్వర్యను ఇంటి వద్ద నుంచి దుండగుడు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పాప తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ హజరత్తయ్య తెలిపారు.