కొండపి: ఊళ్ల పాలెంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన బీచ్ సీసీ రోడ్డును ప్రారంభించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి
సింగరాయకొండ మండలం ఊళ్ల పాలెంలో రూ. 20 లక్షల నిధులతో నిర్మించిన బీచ్ సీసీ రోడ్డును మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గురువారం ప్రారంభించారు. మారిటైం బోర్డు ఛైర్మన్ సత్య ఆధ్వర్యంలో పోర్టులు, బీచ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి స్వామి పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు.