కొండపి: దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే : మంత్రి స్వామి
దేశంలోనే పెద్ద మొత్తంలో సామాజిక భద్రత పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని మంత్రి స్వామి అన్నారు. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నామని, పింఛన్ రూ.4 వేలు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని అన్నారు. రేపటి నుంచి అమరావతిలో నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు.