గిద్దలూరు: గిద్దలూరులో సీఎం చంద్రబాబు పర్యటన, ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు
దాదాపు 5 గంటల పాటు మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో సీఎం చంద్రబాబు గడపబోతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 27వ తేదీ గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో సంజీవిని ఆసుపత్రి ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు వస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నేపథ్యంలో సభ స్థలిని హెలిపాడ్ ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. అలానే క్రిష్టం శెట్టిపల్లి ప్రాథమిక వైద్యశాలను సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం ఒంటిగంటలకు గిద్దలూరు కు సీఎం చంద్రబాబు చేరుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. సాయంత్రం వరకు కార్యకర్తలతో పాటు గడిపి వారి సమస్యలను సీఎం అ