కొండపి: జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్న పోలీసులు
జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు స్కూల్ బస్సు ఫిట్నెస్ని పోలీసులు పరిశీలించారు. నిబంధనలో పాటిస్తూ వాహనాలు నడపాలని విధి నిర్వహణలో ఉండగా డ్రైవర్లు మద్యం తాగకుండా బస్సులు నడపాలని సూచించారు. ఎంతోమంది పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని వారిని సురక్షితంగా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత బస్సు డ్రైవర్లకు ఉందని పోలీసులు బస్సు డ్రైవర్లకు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు వారిని హెచ్చరించారు.