మార్కాపురం: ప్రభుత్వ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాసరయ్య
మార్కాపురం పూల సుబ్బయ్య భవన్ లో జీపు మోటార్ వర్కర్స్ యూనియన్ ఏఐటియూసి ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. గౌరవ అధ్యక్షులు నాసరయ్య మాట్లాడుతూ... కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు, సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, మహిళ కాన్పు 50 వేలు పిల్లల పెళ్లికి లక్ష రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలన్నారు.