రాయదుర్గం: ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన డి.హిరేహాల్ పోలీసులు
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను డి.హిరేహాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి బొలెరో వాహనం, ఒక బైక్, రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను రాయదుర్గంలో రూరల్ సీఐ వెంకటరమణ ఎస్.ఐ గురుప్రసాద్ రెడ్డి తో కలిసి గురువారం విలేకరుల సమావేశంలో వివరించారు. బుధవారం ఉదయం 7:30 గంటలకు డి.హిరేహాల్ పోలీసులు, గ్రామ పంచాయతీ సభ్యులతో కలిసి గ్రామ శివారు వంక వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా బొలెరో వాహనంలో మోటార్ సైకిల్‌ను ఎక్కిస్తున్న వీరిని పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించారు.