దర్శి: మున్సిపల్ కౌన్సిలర్ తో సమావేశం నిర్వహించిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 19, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు మున్సిపల్ కౌన్సిలర్లతో టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.