ఉరవకొండ: మూలగిరిపల్లి లో వందేళ్ళ భూ సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ మండలం ఆమిద్యాల పంచాయతీ పరిధిలోని మూలగిరిపల్లిలో వందేళ్ళ గా ఉన్న భూ సమస్యను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పరిష్కరించారు. అనంతపురంలో తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం మూలగిరిపల్లి గ్రామస్తులకు పట్టాదారు పాసు బుక్కులను మంత్రి పంపిణీ చేశారు. వంశపారంపర్యంగా, పూర్వీకుల నుంచి సక్రమించిన భూములను వందేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే పట్టాదారు పాస్ బుక్కులు కానీ, ఆన్లైన్లో కానీ లేవు. మంత్రి స్పందించి రెవెన్యూ అధికారుల చేత ఉమక్క, జయప్ప, ఈశ్వర్, వెంకటేష్, మహేష్ తదితరులకు పట్టాదారు పాసుబుక్కులు పంపిణీ చేశారు. దీంతో వారు మంత్రిని సన్మానించారు.