దర్శి: తూర్పు వెంకటాపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా రెండు విద్యుత్ ప్రభలు
Darsi, Prakasam | Apr 12, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వెంకటాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుణాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రెండు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భక్తుల అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.