గిద్దలూరు: బేస్తవారిపేట మండలం ఒందుట్ల సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం ఒందుట్ల గ్రామ సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో మార్కాపురానికి చెందిన దేవేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.