గిద్దలూరు: గిద్దలూరు లో 2వ అదనపు న్యాయస్థానాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు
ప్రకాశం జిల్లాలో న్యాయమూర్తులు పెండింగ్ లో ఉన్న కేసులు వేగవంతంగా పరిష్కరిస్తున్నారని ఏపీ హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ప్రశంసించారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో 2వ అదనపు కోర్టు కార్యాలయాన్ని హైకోర్టు జడ్జి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్ విజయ సునీతతో పాటు ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లాలోని పలువురు న్యాయమూర్తులు న్యాయవాదులు హాజరయ్యారు. రాష్ట్రంలో కేసుల పరిష్కారానికి అదనపు న్యాయస్థానాలు ఏర్పాటు చేస్తున్నామని వెంకటేశ్వర్లు తెలిపారు. కోర్టుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయన్నారు.