కొండపి: కొండపిలో అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పడడం పై మంత్రి స్వామి ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ
ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో గురువారం అమరావతి శాశ్వత రాజధానిగా ఏర్పడడం పై మంత్రి స్వామి ఆధ్వర్యంలో పట్టణంలో టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని అంతేకాకుండా రాజ్యసభలో అమరావతి బిల్లు కు ఆమోదం లభించడంపై మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. వేగంగా అమరావతి అభివృద్ధి చెందుతుందన్నారు.