గిద్దలూరు: గిద్దలూరు నియోజకవర్గంలో సంజీవిని హాస్పిటల్స్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సంజీవిని హాస్పిటల్స్ ఏర్పాటుకు అనువైన వైద్యశాలల కోసం కలెక్టర్ విజయ సునీత బేస్తవారిపేట, కొమరోలు, గిద్దలూరు మండలంలోని క్రిష్టం శెట్టిపల్లి ప్రభుత్వ వైద్యశాలలను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునిక పరిజ్ఞానంతో సంజీవిని ఏఐ హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆదేశాలతో అనువైన ఆసుపత్రుల కోసం సందర్శిస్తున్నట్టు కలెక్టర్ మీడియా ముఖంగా తెలిపారు.