కొండపి: సింగరాయకొండలో హిందూ - ముస్లిం మైనార్టీ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహణ
సింగరాయకొండలో హిందూ - ముస్లిం మైనార్టీ వేదిక ఆధ్వర్యంలో బుధవారం వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. సింగరాయకొండ సెంటర్ నుంచి కందుకూరు రోడ్డు వరకు వందల సంఖ్యలో ముస్లిం మైనార్టీ ప్రజలు ర్యాలీగా చేరుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు.