తాడిపత్రి: చుక్కలూరు సమీపంలోని పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్, జే సీ బీ లను సీజ్,నలుగురు పై కేసు నమోదు
తాడిపత్రి మండలం చుక్కలూరు సమీపంలోని పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్, ఇసుకను తవ్వుతున్న జే సీ బీ లను బుధవారం తాడిపత్రి రూరల్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా టిప్పర్, జే సీ బీ డ్రైవర్లు, యజమానులైన వంశీ, నాగార్జున, లక్ష్మీనారాయణ, పవన్ కుమార్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ శివ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ఇసుకను అక్రమంగా తవ్వినా, తరలించినా వాల్టా చట్టం ప్రకారం కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.