మార్కాపురం: చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యేలు వెంకట రెడ్డి రాంబాబు
మార్కాపురం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు వెంకటరెడ్డి, రాంబాబు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో జూన్ 4వ తేదీ నుండి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ మార్కాపురం తర్లుపాడు ఐదో తేదీ కొనకనమిట్ల పొదిలి లో నిర్వహిస్తామన్నారు.