గిద్దలూరు: రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని ఉపాధ్యాయురాలు అనురాధ వెల్లడి
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మార్కాపురం జిల్లా రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల లక్ష్యమని ఉపాధ్యాయురాలు అనురాధ అన్నారు. 2026/27 విద్యా సంవత్సరానికి గాను స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ 2 సిలబస్ ని ప్రారంభిస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. దీనివల్ల రైల్వే ఉద్యోగాలు కూడా విద్యార్థులు పొందవచ్చు అని అన్నారు. దృశ్య రూపంలో ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా విద్యార్థులకు అర్థవంతమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని విశాలమైన క్రీడా మైదానం కూడా ఉన్నట్లుగా వెల్లడించారు. తల్లితండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చద