యర్రగొండపాలెం: తర్లుపాడు మండల పరిధిలో రోడ్డు ప్రమాదన నివారణకు మిర్రర్లు ఏర్పాటు చేసిన ఎస్సై బ్రహ్మ నాయుడు
మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు పోలీసులు మిర్రర్లు ఏర్పాటు చేస్తున్నారు. తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదల నివారణకు ఎస్సై బ్రహ్మనాయుడు మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి శుక్రవారం మిర్రర్లు ఏర్పాటు చేశామని ఎస్పీ ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఈ మిర్రర్లను వినియోగించుకొని రోడ్డు ప్రమాదల నివారణకు వాహనదారులు కృషి చేయాలని ఎస్సై బ్రహ్మనాయుడు విజ్ఞప్తి చేశారు.