యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో రోడ్డుపై ద్విచక్ర వాహనాలు అడ్డుగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం లోని పాలంకయ్య ఇంటిదగ్గర వీధిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని స్థానికులు తెలిపారు. రోడ్డు మధ్యలో అక్రమంగా బైకులు కార్లు ఇతర వస్తువులు ఉంచడంతో నడవడానికి కూడా స్థలం లేదని అన్నారు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ చిన్న వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నోసార్లు అధికారులకు తెలియజేసిన ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు