తాడిపత్రి: తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం, స్వామి పాదాలను తాకిన సూర్యకిరణాలు
తాడిపత్రి లోని పెన్నా నది ఒడ్డున వెలిసి ఉన్న అతి పురాతనమైన, పవిత్రమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం సూర్యాస్తమయం సమయంలో స్వామి పాదాలపై సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు యోగేంద్ర శర్మ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.