రాయదుర్గం: పట్టణ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాయదుర్గం: పట్టణ శివారులోని కుంటి మారెమ్మ గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం కై తరలించారు. మృతుడి వివరాలు రాబట్టేందుకు దర్యాప్తు చేపట్టారు.