యర్రగొండపాలెం: పుల్లలచెరువులో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన విద్యుత్ శాఖ అధికారులు
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు లో కేజీబీవీ బ్యాంకు సమీపంలోని వీధిలో లో వోల్టేజ్ సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు తెలియజేశారు. విద్యుత్ శాఖ అధికారులు సంబంధిత ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పరిశీలించారు. అనంతరం ట్రాన్స్ఫారం ఏర్పాటు చేసి లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.