దర్శి: తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించిన జిల్లా పిడి జోసఫ్ కుమార్
ప్రకాశం జిల్లా తాళ్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో జిల్లా పీడీ జోసఫ్ కుమార్ సమావేశం నిర్వహించారు. మండలంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ఆదేశించారు. కూలీలకు 300 రూపాయలు ఆదాయం చూపించాలన్నారు. వేసవిలో కూలీలకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అజిత ఏపీవో అధికారులు తదితరులు పాల్గొన్నారు.