గిద్దలూరు: బెస్తవారిపేట మండలం నేకునంబాద్ గ్రామంలో కార్డెన్ సర్చ్ నిర్వహించిన పోలీసులు, 21 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం నేకునంబాద్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రుపత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంటిని జల్లెడ కొట్టడంతో పాటు అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు సేకరించారు. తర్వాత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించి వారికి చేత ప్రతిజ్ఞ చేయించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీ ఆదేశాలతో కార్డెన్ సర్చ్ నిర్వహించినట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. స్పాట్ విజువల్స్..