దర్శి: దర్శి పట్టణంలో వాహనాలకు ఎల్ఈడి లైట్లు తొలగించిన ఎస్సై మురళి
Darsi, Prakasam | May 10, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ మురళి తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు వాహనాలకు అదనంగా ఎల్ఈడి లైట్లు తొలగించడంలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలతో వచ్చిన లైట్లు మాత్రమే ఉంచుకోవాలని మిగతా ఎల్ఈడి లైట్లు తొలగించాలని వాహనదారులకు అవగాహన కల్పించామన్నారు.