కొండపి: టంగుటూరు టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపిన పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలిస్తున్నట్లు బుధవారం సీఐ హజరతయ్యా మీడియాకు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 6 కేజీల గంజాయి రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులు ఈజీ మనీ కోసం అలవాటు పడి అల్లూరి జిల్లా నుంచి గంజాయి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుల ఐదు మొబైల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.