మార్కాపురం: తర్లుపాడులో మేకలను అపహరించుకోపోయిన దొంగలను పట్టుకున్న బాధితులు
మార్కాపురం జిల్లా తర్లుపాడు కు చెందిన వెలుగొండయ్య మేకలను గురువారం తెల్లవారుజామున దొంగలు అపహరించుకుని వెళ్లారు. వెంటనే బంధువులు యువకులు కలిసి పెద్దారవీడు మండలం కుంట గొర్రెల సంత వద్దకు వెళ్లారు. అప్పటికే దొంగిలించుకు వెళ్ళిన పది మేకలలో ముందస్తుగా ఎనిమిది మేకలను దొంగలు అమ్ముకున్నారు. మిగిలిన రెండు మేకలు విక్రయిస్తుండగా సంతలో బాధితులు మేకలను గుర్తించి దొంగల్లో ఇద్దరిని పట్టుకున్నారు. తర్లుపాడు పోలీస్ స్టేషన్లో అప్పగించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల్లోని మరి కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.