దర్శి: తాళ్లూరు మండలం తురకపాలెం నుంచి గంగవరం వరకు గ్రామీణ రోడ్లు అధ్వానం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని గ్రామీణ రోడ్ల అధ్వానంగా తయారయ్యాయి. తురకపాలెం నుంచి గంగవరం వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారింది. దారి పొడవు నా గుంతలు ఉండడంతో ప్రయాణం కష్టంగా ఉందని వాహనదారులు వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు.