కొండపి: కొండపి మండలం కట్టుబడిపాలెం లో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి మండలం కట్టుబడి పాలెం లో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి హాజరై లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే పెన్షన్లను పంపిణీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతినెల 1వ తేదీకే ఇండ్ల వద్దనే పెన్షన్లు అందిస్తున్నామని అలానే ఇప్పటికే సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినట్లు మంత్రి అన్నారు. మేలు చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.