గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 20వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 20వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ మంగళవారం తెలిపారు. మరమ్మతుల కారణంగా కసినపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని ఓబులాపురం, మలిక పల్లె గ్రామాలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయ గృహ సంబంధిత విద్యుత్ సరఫరా ఉండదని ఈ విషయాన్ని ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.