సంతనూతలపాడు: చీమకుర్తిలో ప్లాస్టిక్ రహిత సమాజానికి కట్టుబడి ఉంటామని సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించిన మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య
ప్రకాశం జిల్లా చీమకుర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ రామకృష్ణయ్య పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయాలని అన్నారు. పట్టణ వీధుల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. యువత ప్రజలు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని కమిషనర్ సూచించారు తదుపరి అధికారులు సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.