రాయదుర్గం: రైల్వే డబ్లింగ్ భూసేకరణపై ఆర్డీఓ క్షేత్ర స్థాయి పరిశీలన
రాయదుర్గం పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు సంబంధించిన భూసేకరణపై కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గురువారం స్థానిక తహసీల్దార్ సూర్యప్రతాప్, సర్వేయర్, ఆర్ఐ, వీఆర్వోలతో కలిసి రైల్వే స్టేషన్ సమీప భూములు పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని క్షేత్ర స్థాయి అధికారులను ఆయన ఆదేశించారు.