కొండపి: సింగరాయకొండ బాలయోగి నగర్ లో ఏప్రిల్ 15వ తేదీన అన్న క్యాంటీన్ ని ప్రారంభించనున్న ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ బాలయోగి నగర్ లో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. ఏప్రిల్ 15 బుధవారం అన్న క్యాంటీన్ ని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి ప్రారంభిస్తారని స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మంగళవారం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యా అని కూటమి నాయకులు తెలిపారు. కేవలం రూ.5కే ఒక్కొక్క పూట చెల్లించి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఆరగించవచ్చని నాయకులు తెలిపారు.