మార్కాపురం: జిల్లా కేంద్రంలో హనుమంత వాహనంపై చెన్నకేశవ స్వామి ఊరేగింపు ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై స్వామిని పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. చెన్నకేశవ స్వామి కృప జిల్లా ప్రజలపై ఉండాలని బ్రహ్మోత్సవాలు జరుపుతున్నామన్నారు