గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని జంగాల కాలనీలో కార్డెన్ సర్చ్ నిర్వహించి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని జంగాల కాలనీలో శనివారం స్థానిక పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి జరిమానా విధించినట్లు అర్బన్ సీఐ సురేష్ తెలిపారు. అలాంటి ప్రజలకు మత్తు పదార్థాలు గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. తర్వాత అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు వారి పూర్తి వివరాలు సేకరించామని సీఐ తెలిపారు.