మార్కాపురం: సీక్రెట్ ఓటింగ్ పద్ధతి నిర్వహించాలని మత్స్యకార సొసైటీ సభ్యులు కలెక్టర్ విజయ సునీతకు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంభం మత్స్యకార సొసైటీ సభ్యులు సీక్రెట్ ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికలు జరపాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సొసైటీ అధ్యక్షులు సోమయ్య మాట్లాడుతూ 2000 సంవత్సరం వరకు బెస్త కులం వారు సుమారు 450 మంది సభ్యులు కొనసాగుతున్నారన్నారు. అప్పుడు చేతులెత్తే పద్ధతి ద్వారా సొసైటీ ఎన్నికలు జరిగేవి అన్నారు. 2021 సంవత్సరంలో వివిధ కులానికి చెందిన 700 మందికి పైగా సభ్యులు ఉన్నందున శాంతి భద్రతలు తలెత్తకుండా సీక్రెట్ ఓటింగ్ పద్ధతిలో ఎన్నికలు జరపాలన్నారు.