తాడిపత్రి: యాడికి తోపాటు మండల వ్యాప్తంగా అన్ని చర్చిలలో అత్యంత ఘనంగా ఈస్టర్ వేడుకలు
యాడికి మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా అన్ని చర్చిలలో, ప్రార్థనా మందిరాల్లో ఆదివారం క్రైస్తవులు ఈస్టర్ (ఏసుప్రభు పునరుత్థానం) వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీ ఎస్ ఐ, అగాపే తదితర చర్చిలలో పాస్టర్లు ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈస్టర్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును ప్రార్థించాలన్నారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల నాయకులు, సభ్యులు, క్రైస్తవులు పాల్గొన్నారు.