మార్కాపురం: పొదిలిలో పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు రాస్తారోకో
పొదిలి పొగాకు వేలంలో గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోజుకు 10 శాతం కూడా పొగాకు బేళ్లను కొనుగోలు చేయడం లేదని దీంతో రాత్రి పగలు పడిగాపులు కాయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని రైతులకు సర్ది చెప్పడంతో రాస్తారోకో విరమించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు