రాయదుర్గం: ట్రాక్టర్ డీకొన్న ఘటనలో పాడిగేదె తీవ్రంగా గాయపడి మృతి
బొమ్మనహాల్ మండలం బండూరు రోడ్డులో ట్రాక్టర్ ఢీకొని పాడిగేదె మృతి చెందింది. బొమ్మనహాల్ రైతు బసవరాజు సోమవారం సాయంత్రం గేదెతో ఇంటికి వెళ్తుండగా నేమకల్లు వైపు నుంచి వచ్చిన ట్రాక్టర్ బ్రేకులు ఫెయిలై ఢీకొట్టింది. తీవ్ర రక్తగాయాలతో విలవిలలాడి కొద్ది సేపటి తర్వాత మృతి చెందింది. రెండు రోజుల క్రితం 30 వేలకు ఆ గేదెను కొన్నానని రైతు కన్నీరుమున్నీరయ్యాడు.