గిద్దలూరు: గిద్దలూరు మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన, అధికారులకు చురకలు అందించిన సీఎం, పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గిద్దలూరు మండలంలో శనివారం పర్యటించారు. సంజీవిని ఆసుపత్రి ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. అధికారుల పనితీరు బాగోలేదని సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రతి మార్చుకోకపోతే తాను ఊరుకునేది లేదని హెచ్చరించారు. గిద్దలూరులో చాలా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో వెనుకబడి ఉన్నారని ఇకమీదట అధికారులు దృష్టి సారించి పనులు బాగా చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు కూడా అందుకు తగ్గట్టుగా పనిచేయాలని గిద్దలూరు ను అభివృద్ధి చేసే బాధ్యత తనది అని సీఎం తెలిపారు.