దర్శి: దర్శి మండలం, కొత్త రెడ్డిపాలెం గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చెందిన ఇంటిలో నగదు బంగారం చోరీ చేసిన దొంగలు
Darsi, Prakasam | May 17, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్త రెడ్డిపాలెం గ్రామంలో శనివారం రాత్రి సమయంలో చోరీ జరిగిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి ఇంటిలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువా పగలగొట్టి రూ.4.50 లక్షలు నగదు నాలుగు సవర్ల బంగారం దొంగలు అపహరించారని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చోరీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.