దర్శి: దొనకొండ మండలంలోని ప్రజలు వడదెబ్బ తగలకుండా ప్రమాదంగా ఉండాలని డాక్టర్ చంద్రమౌళి హెచ్చరిక
ప్రకాశం జిల్లా దొనకొండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ చంద్రమౌళి వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడగాలులు విపరీతంగా వస్తున్నాయి. ప్రజలు కూలీలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విపరీతమైన తలనొప్పి కండ్లు మంటలు నీరసము తదితర లక్షణాలు ఉన్నప్పుడు యాంటీబయటిక్ టాబ్లెట్స్ వాడకుండా ఓఆర్ఎస్ తీసుకోవాలన్నారు. మీ సమీపంలో ఉన్న ఆశా కార్యకర్తల దగ్గర ఉంటాయని వాటిని తీసుకొని పనులకు వెళ్లాలన్నారు.