విశాఖపట్నం: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను త్వరలో పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నంలో జరిగిన జర్నలిస్టుల వినాయక చవితి వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, పెన్షన్, ఆరోగ్య భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 700 మంది పాత్రికేయులకు మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేశారు.