యర్రగొండపాలెం: సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పర్యటనపై పలు విమర్శలు చేసిన వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు సీఎం చంద్రబాబు పర్యటన పై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పలు విమర్శలు చేశారు. ప్రాజెక్టు పనులను ఎక్కువ శాతం చేసింది ఆనాడు దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు. మీరు చేసిన పని ఎంతో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పరిపాలించిన టిడిపి ప్రభుత్వం ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు.