మార్కాపురం: మార్కాపురం నికరంపల్లి పెద్దనాగులవరం గ్రామాల మధ్య గుండ్లకమ్మ నదిపై బ్రిడ్జి ఏర్పాటు జరిగేనా ?
మార్కాపురం మండలం నికరంపల్లి పెద్ద నాగులవరం గ్రామంలోని కూలీలు ప్రతిరోజు పనుల నిమిత్తం మార్కాపురం వస్తూ వెళ్తూ ఉంటారు. ఆ గ్రామాలకు మార్కాపురానికి మధ్య గుండ్లకమ్మ నది ఉంది. ఎన్నో సంవత్సరాలుగా గుండ్లకమ్మ నదిని దాటుతూ ప్రమాదాలకు గురై పలువురు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరిగిన సమయంలో ఆ మాట బలంగా వినపడుతుంది. తర్వాత పట్టించుకున్న నాధుడు లేడు అని గ్రామస్తులు అన్నారు