రాయదుర్గం: పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తో కలసి బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారిని పల్లకిలో తీసుకువచ్చి వథంలో కొలువుదీర్చారు. మడుగుతేరు లాగి రథోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల ప్రజలకు ఆ దేవదేవుడి ఆశీస్సులు ఉండాలని సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నారు.