గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామంలో రాష్ట్రస్థాయి బండలాగున పోటీలు ప్రారంభించిన టిడిపి నాయకులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపి చెరువు గ్రామ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు 16 రోజుల పూర్తి చేసుకున్న కారణంగా శుక్రవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు మరియు టిడిపి నాయకుడు కృష్ణ కిషోర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పోటీలలో విజయం సాధించే ఎడ్ల జతల యజమానులకు నగదు బహుమతులు అందజేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.